జూ.ఎన్టీఆర్ పై కొడాలి నాని సెన్సేషన్ కామెంట్స్

ఈ నెల 23న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైయస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో తెలుగు దేశం పార్టీ పూర్తి డిజాస్టర్ అయ్యింది. వైసిపి 175 సీట్లకుగాను 151 సీట్లు కైవసం చేసుకోవటం ఎవరికీ మింగుడు పడటం లేదు.

తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వటం పార్టీ అభిమానులను చాలా బాధిస్తోంది. ఈ విషయమై వైసిపి ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి, ఎన్టీఆర్ సీన్ లోకి రావాల్సిన టైమ్ వచ్చిందంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసారు. ఈ వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపుతున్నాయి.

రీసెంట్ గా నాని మీడియాతో మాట్లాడుతూ .. ఇప్పటికైనా నందమూరి కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.తాను గుడివాడ నుంచి మరోమారు ఎన్నికయ్యానంటే జగన్ కు ఉన్న ప్రజాదరణ కారణం అని అన్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో టిడిపి తుడిచిపెట్టుకుపోయింది వ్యాఖ్యానించారు.

కొడాలి నాని మాట్లాడుతూ…కొంతమంది చంద్రబాబుకు భజన చేసేవాళ్ళు చెబుతుంటారు.. కష్టాల్లో ఉన్న టీడీపీని ఎన్టీఆర్ నుంచి తీసుకుని చంద్రబాబు విజయవంతంగా నడిపిస్తున్నారు అని. కానీ అసలు నిజం వేరు. ఎన్టీఆర్ హయాంలో టిడిపి అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. కానీ బాబు హయాంలో అంతటి భారీ విజయం టిడిపికి ఎప్పుడూ రాలేదు. 2014లో కూడా కేవలం స్వల్ప తేడాతో టిడిపి గట్టెక్కిందే విషయం గుర్తించుకోవాలి. చంద్రబాబు వల్ల టిడిపికి ఒరిగింది ఏమీ లేదు అని ఆయన అన్నారు.

అన్ని రాష్ట్రాల్లో తమ ప్రభావం ఉండేలా మోడీ , అమిత్ షా బిజెపిని విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా నందమూరి కుటుంబం కళ్ళు తెరచి టీడీపీ పగ్గాలు చెప్పాట్టాలి. జూ. ఎన్టీఆర్ తో రాజకీయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. అతను ఇంకా ముప్పైల్లోనే ఉన్నారు. సినిమాల్లో అతనికి గొప్ప భవిష్యత్ ఉన్న మాట నిజం. అయితే పూర్తిగా పరిస్దితులు చేజారాక వస్తే పెద్ద ఉపయోగం ఉండదు. 2024కు రియలైజ్ అయ్యినా చంద్రబాబు, లోకేష్ ఆద్వర్యంలో టీడీపి ఎడ్రస్ గల్లంతు అవుతుంది. ఎన్టీఆర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి అన్నారు.