కొబ్బరిమట్ట రిలీజ్ డేట్ ఫిక్స్

బర్నింగ్ స్టార్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న సంపూర్ణేష్ బాబు హీరోగా, రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకుడిగా.. ‘హృద‌య‌కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ క‌థ‌, క‌థ‌నం, మాట‌లు అందించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం ఆగస్ట్ 10న విడుదల చేసేందుకు నిర్మాత సాయి రాజేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే.

పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు‌గా సంపూర్ణేష్ బాబు నటించిన ఈ చిత్ర నైజాం, ఓవర్‌సీస్ హక్కులు కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా చిత్ర నిర్మాత తెలిపారు. నోబారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది.