సంపూర్ణేష్ బాబు కామెడీ హీరోగా అందరికీ సుపరిచితమే. సంపూర్ణేష్ బాబు జన్మించాడు. ఇతడికి ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అన్నపై పడింది. పూట గడవడం కూడా కష్టంగా ఉండేది.ఇతడు పదవ తరగతి తర్వాత అన్నకు సాయంగా ఉండాలని ఒక దుకాణంలో చేరాడు. తర్వాత తాను కూడా తన అన్న చేస్తున్న వెండి బంగారు పని నేర్చుకొని సిద్దిపేటలో షాప్ పెట్టాడు. తర్వాత ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది.
సంపూర్ణేష్ బాబుకు చిన్నప్పటినుండి సినిమాలలో నటించాలని ఆశ ఉండేది. స్కూల్ లలో జరిగే నాటకాలలో ఎంతో ఇష్టంగా నటించేవాడు. ఒకసారి సిద్దిపేటలో ఏదో సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిన్న పాత్ర అవకాశం వస్తే అందులో నటించాడు. సీరియల్ వాళ్ళు నటనలో శిక్షణ తీసుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. కొంత మేరకు శిక్షణ తీసుకొని తమ సొంత ఊరు మెట్టిపల్లిలో షూటింగ్ జరగడంతో అక్కడికి వెళ్లి ప్రయత్నించగా చిన్న పాత్ర ఇస్తే బాగానే చేశాడు. ఆ తర్వాత కాస్త నమ్మకంతో హైదరాబాద్ వచ్చి అన్ని ఆఫీసులలో ఫోటోలు ఇవ్వడం ఆడిషన్స్ కు వెళ్లడం చేసేవాడు.
ఒక్కోసారి భోజనం లేక డబ్బులు అయిపోయి బస్టాండ్ లో నిద్రపోయేవాడు. చాలామంది నువ్వు నటించడం ఏంటి నీ మొహం అద్దంలో చూసుకో అంటూ అవమానించారని అయినా వారి మాటలు పెడిచెవిన పెట్టి ప్రయత్నాలు వదలలేదు. ఎట్టకేలకు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మహాత్మ సినిమాలో చిన్న పాత్ర అవకాశం గా వస్తే తన నటనను నిరూపించుకున్నాడు. తరువాత సంపూర్ణేష్ బాబును హీరోగా పెట్టి హృదయ కాలేయం అనే సినిమా చేయాలని స్టీఫెన్ శంకర్ ఆలోచన. సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహ చారి.
ఈ సినిమాకి ముందు పేరు మార్చుకున్నాడు. కోటి యాభై లక్షల బడ్జెట్ తో విడుదలైన చిత్రం 5.5 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన కొబ్బరి మట్ట తనకు టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత అవమానించిన వాళ్లంతా సెల్ఫీలు దిగి పొగిడేవారు. ఇలా సంపూర్ణేష్ బాబు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, బాగా ప్రయత్నించి సక్సెస్ లో దూసుకుపోతున్నారు.
అప్పట్లో అయితే ఒక రోజుకు 1000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఇప్పుడు ఒక సినిమాకు 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈయన ఐదు నుంచి ఆరున్నర కోట్ల వరకు ఆస్తి ఉంటుందని టాలీవుడ్ లో సమాచారం.