వల్గర్ షాట్  చూపి నవ్వుకోమంటే ఎలా సంపూ

                                                            (సూర్యం)

వల్గారిటీకు , కామెడీకు చిన్న గీతే అడ్డం. కామెడీ పేరుతో అతి చేస్తే భరించటం కష్టం. కానీ అతినే నమ్ముకున్న సంపూర్ణేష్ బాబు దాన్ని దాటి ఎక్కడికి వెళ్లగలడు. వెళ్లినా ఏం సాధించాడు. అందుకే తన రూట్స్ కి అంటే హృదయకాలం రోజులుకు వెళ్లి..అలాంటి స్ఫూఫ్ కాన్సెప్టుతో ‘కొబ్బరిమట్ట’ అంటూ నవ్వించే ప్రయత్నం చేసాడు.

వాస్తవానికి  సంపూర్ణేష్ బాబు హీరోగా సుమారు నాలుగు సంవత్సరాల నుంచి తెరకెక్కుతోన్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రమోషన్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. 14 నవంబర్, 2018న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సాంగ్‌ టీజర్‌ను విడుదల చేశారు.

‘కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరిమట్ట కథ’.. అంటూ సాగే కామీడీ సాంగ్ లో కాస్తంత వల్గారిటీని కలిపారు. అదే హాట్ టాపిక్ గా మారి సెల్లింగ్ పాయింట్ గా మారుతుందని భావిస్తున్నారేమో.   నవంబర్‌లో విడుదలయ్యే ఈ సినిమా ప్రోమోలో మేము దేనిగురించి మాట్లాడుతున్నామో..మీరే చూసి తెలుసుకోండి.

కొబ్బరి ఆకుల సాంగ్ టీజర్