మోహన్ లాల్ కు మంట బాగానే పెట్టారు..తట్టుకోలేక బై చెప్పాడు

కొన్ని సున్నితమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవటం అంతా ఆషామాషి విషయం కాదు. అది మోహన్ లాల్ ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. ఆయన గత కొద్ది నెలలుగా మరో హీరో దిలీప్ విషయమై విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక వాటికి చెక్ చెప్పాలని ఓ నిర్ణయం తీసుకుని అందరినీ శాంతపరిచారు.

వివరాల్లోకి వెళితే… గత సంవత్సరం ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మలయాళ నటి భావనపై కొచ్చిలో లైంగిక వేధింపులు జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న నటి కారును కొందరు అడ్డగించి, ఎత్తుకెళ్లారు. చాలా సేపు ఆమెను కారులో తిప్పుతూ లైంగికంగా వేధించి, ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మాజీ డ్రైవరు పల్సర్‌ సునితోపాటు అతని ఫ్రెండ్స్ ని అరెస్టు చేశారు. దిలీప్‌ను‌ కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. పాతకక్షల నేపథ్యంలో ఆయన ఈ పని చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై కొన్ని రోజులు జైలులో ఉన్న దిలీప్ బెయిలుపై బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మొదట దిలీప్‌ ‘అమ్మ’  మెంబర్ షిప్ ని  రద్దు చేసినా… బెయిలుపై బయటికి వచ్చిన తర్వాత మళ్లీ
ఆయనకు సభ్యత్వం ఇచ్చారు.

దీంతో భావన… ‘అమ్మ’ నుంచి తప్పుకుంది. ఆమెకు సపోర్ట్ గా రిమా కలింగల్‌, రమ్య  బిసన్‌, గీత్‌ మోహన్‌దాస్‌ రాజీనామా చేశారు. దిలీప్‌ను తిరిగి ‘అమ్మ’లోకి తీసుకోవడం పట్ల విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివిటీ  తరఫున రేవతి, పార్వతి, అర్చనా పద్మ… తదితరులు ‘అమ్మ’కు ఉత్తరం రాశారు. వివరణ ఇవ్వాలని కోరారు.

ఈ విషయంపై గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. నిందితుడు దిలీప్‌కు మోహన్‌లాల్‌ మద్దతు తెలుపుతున్నారని రేవతి, పార్వతి వంటివారు బలంగా విమర్శించారు.  ఈ నేపధ్యంలో మోహన్ లాల్ …అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (‘అమ్మ’) నుంచి…  దిలీప్‌ను తొలగించారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన రాజీనామా లేఖను సమ్మతించినట్లు ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ స్పష్టం చేశారు.

‘గత కొద్ది కాలంగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక దీనికి  ముగించే నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చింది. నేను దిలీప్‌ను పిలిచి, నా డెసిషన్ చెప్పాను. ‘అమ్మ’లో తన సభ్యత్వానికి రాజీనామా చేయమని అడిగాను. ఆయన సంతకం చేసిన రాజీనామా లేఖను పంపారు. ఈ  ఇష్యూలోకి  అనవసరంగా నన్ను విమర్శిస్తున్నారు’ అని మోహన్‌లాల్‌ మీడియాతో  అన్నారు.