పాపం కీర్తి సురేష్!

నాగార్జున సినిమా మన్మధుడు 2 యూరప్‌ నుంచి ఇండియాకి రిటర్న్‌ అయ్యారు. అక్కడి షెడ్యూల్‌ ముగించుకుని వచ్చారు కదా! కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారేమో? అంటే నో రెస్ట్‌ అట. మరో వారం నుంచి మళ్లీ పనిలో పడిపోతారట.

కీర్తీ సురేశ్‌ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు నరేంద్రనాథ్‌ ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేశ్‌ కోనేరు నిర్మాత. ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవలే స్పెయిన్‌లో నెలరోజులు చిత్రీకరణ జరిపారు యూనిట్‌.

వారం రోజుల్లో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించనున్నారు. రాజేంద్రప్రసాద్, నదియా, నరేశ్, కమల్‌ కామరాజు కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్‌ చేయనుంది చిత్ర యూనిట్‌.