ఆ భామ‌కి శ్రీరాముడే కావాలంట‌!

మ‌ల‌యాళి న‌టి మేన‌క వార‌స‌త్వంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ స‌హా కోలీవుడ్ లోనూ అమ్మ‌డు పాపుల‌ర్ అయింది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌లను సొగ‌స‌రి చుట్టేసింది. డిఫ‌రెంట్ స్క్కిప్ట్ లు….హీరోల‌కు ధీటుగా ఉండే పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ…గ్లామ‌ర్ రోల్స్ కు దూరంగా ఉంటూ త‌న‌కంటూ ఓ ఐడెంటీని క్రియేట్ చేసుకుంది. మ‌హాన‌టి స‌క్సెస్ త‌ర్వాత కీర్తి టాలీవుడ్ కెరీర్ అంత‌కంత‌కు ఊపందుకుంటుందని ఊహించారు. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయింది. అంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ఉన్నా! అమ్మ‌డు గ్లామ‌ర్ రోల్స్ పై ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో ఇక్క‌డ అవ‌కాశాలు కోల్పోవ‌ల్సి వ‌చ్చింది.

ప్ర‌స్తుతానికి కోలీవుడ్ లో మాత్రం బిజీగానే ఉంది. ఇక అమ్మ‌డు వ్య‌క్తిగ‌త విష‌యాల్లో వెళ్తే! ఇప్ప‌టివ‌వ‌ర‌కూ ప్రేమ దోమ అంటూ ఏ హీరోతోనూ ఏఫైర్ నెరిపిన‌ట్లు ఎక్క‌డా రూమ‌ర్ కూడా రాలేదు. అమ్మ‌డి కెరీర్ పై ఇప్ప‌టివ‌ర‌కూ ఒక మ‌చ్చ కూడా లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గానే ఉంది. ఆ మ‌ధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ కీర్తికి ఓ త‌మిళ న‌టుడి పెళ్లైన‌ట్లు..పిల్ల‌లు ఉన్న‌ట్లు ప్ర‌చారం చేసింది. కానీ త‌ర్వాత ఆ వార్త రూమ‌ర్ అని తేలింది. తాజాగా ఓక‌న్న‌డ ఇంట‌ర్వూలో పెళ్లి ఎప్పుడూ చేసుకుంటారు? ఎలాంటి వాడు మీ ఛాయిస్ అని అడిగితే! త‌డ‌బ‌డకుండా శ్రీరాముడు లాంటి వాడు కావాలి. అత‌నంత క్లీన్ గా ఉండాలి.

ప్రేమ‌..ఎఫైర్లు ఇలాంటివి గ‌తంలో ఉన్నా అలాంటి వ్య‌క్తిన త‌న జీవితంలోకి రానివ్వ‌న‌ని క‌రాఖండీగా చెప్పేసింది. త‌ల్లి న‌టి కావ‌డంతో సినిమా వాళ్ల‌పై ఎలాంటి రూమ‌ర్లు వ‌స్తాయో ఊహించ‌గ‌ల‌ను. అందుకే నేను గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటూ…మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌ల‌నే చేస్తున్నా. ప్రేమ కు నేను ఇప్ప‌టివ‌ర‌కూ దూరంగా ఉన్నాను. ఒక‌వేళ ప్రేమించినా అత‌ని గురించి అన్ని వివ‌రాలు ముందే తెలుసుకుంటా. అప్పుడే ప్రేమిస్తా. నా ఆలోచ‌ల్ని పాత‌గా ఉన్నా..భ‌ర్త విష‌యంలో ఇలాగే ఉండాల‌ని ఎప్పుడో నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపింది. మ‌రి ఈ డిజిట‌ల్ యుగంలో శ్రీరాముడు లాంటి భ‌ర్త దొరుకుతాడో? లేదో?