కీర్తి సురేష్ కోలీవుడ్ లో బిజీగా ఉంది. టాలీవుడ్ లో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ అనే రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాషూటింగ్ డిలే అవుతోంది. ఆ రెండు సినిమాలు ప్రారంభమై నెలలు గడుస్తోంది. కానీ వాటికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేదు. దీంతో అమ్మడు పూర్తిగా కోలీవుడ్ సినిమాలపైనే కాన్సంట్రేషన్ చేస్తోంది. ఇదే స్పీడ్ లో బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ నటిస్తోన్న మైదాన్ సినిమాలో నటించే అవకాశం దొరికింది.
1952 నేపథ్యంలో ఫుట్ బాల్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. బోనీకపూర్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ భార్య పాత్ర కు కీర్తినే ఎంపిక చేసారు. దీంతో అమ్మడు ఎగిరి గత్తేందిసంది. బాలీవుడ్ డెబ్యూనే మంచి ఆఫర్ అని సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. అజయ్ సరసన కీర్తి చిన్న పిల్లలా..తనకు కూతురులా కనిపిస్తోందని ట్రయిల్ షూట్ లో తేల్చేసారుట.
కీర్తి బాగా బరువు తగ్గడంతో ఈ సమస్య వచ్చిందని…మహానటి సినిమాలో ఉన్నంత బరువు ఉంటే బాగుండేదని టీమ్ భావించిందట. కానీ ఇప్పటికిప్పుడు అంత బరువు పెరగడం కష్టం అవ్వడంతో కీర్తినే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ ఛాన్స్ ప్రియమణికి వరించింది. అజయ్ సరసన ఈ హాట్ భామ అయితే పర్ పెక్ట్ గా మ్యాచ్ అవుతుందని యూనిట్ ఆమెను సంప్రదించి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.