కీరవాణికు రెండవ కుమారుడు తండ్రి దారిలో వెళ్లకుండా..

పిల్లలు తమ తండ్రి దారిలోనే వెళ్లాలని రూల్ లేదు కదా. అదే నమ్మినట్లున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు సింహా కోడూరి. సింహాకు సంగీతం కన్నా దర్శకత్వం, నటన అంటే మక్కువ. అందుకే సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు . ఇప్పుడు హీరోగా పరిచయం అవటానికి రంగం సిద్దమైంది.

కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ సింగర్ గా పరిచయమయ్యాడు. బాహుబలి 2 లో దండాలయ్యా పాట, అరవింద సమేతలో పెనివిటి పాటను ఆయనే పాడారు. ఇప్పుడు సంగీత దర్శకుడిగా కూడా పని చేస్తున్నాడు. భైరవ మైత్రీ మూవీస్ లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

కీరవాణి కుమారుడు కోడూరి సింహ

కీరవాణి రెండో కుమారుడు సింహా కోడూరి హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నాడు. ఓ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింతో సింహా కోడూరిని హీరోగా పరిచయం చేయటానికి ముందుకు వచ్చింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నారు.