కౌశల్ కు మెగా హీరో కిక్ ఇచ్చే ఆఫర్‌?

గత కొద్ది నెలలుగా సోషల్ మీడియా మొత్తం కౌశల్ పేరుని జపంగా చేసింది. ఆ పబ్లిసిటీ కౌశల్ కు బాగా కలిసి వచ్చింది.   బిగ్ బాస్ హౌస్‌లో తనదైన స్టైల్‌లో విభిన్నంగా గేమ్‌ ఆడిన కౌశలే బిగ్‌బాస్‌ సీజన్‌-2 విన్నర్‌గా నిలిచారు. సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’.. కౌశల్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసేసింది. బిగ్‌బాస్‌ ట్రోఫీ దక్కించుకున్న కౌశల్‌కు ఎందరో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.అంతేకాదు‘బిగ్‌బాస్’ విజేతగా నిలిచిన కౌశల్‌కు వరుసగా సినిమా ఆఫర్స్ వరస పెట్టి  వస్తున్నాయని సమాచారం. ముందుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న  ఓ చిత్రంలో  కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో కౌశల్ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ‌ఈ  చిత్రంలో  అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్‌ రాజేశ్‌ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘స్టేట్‌ రౌడీ’ పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.