‘నువ్వేమన్నా సత్యసాయిబాబావా?’ మంచు మనోజ్ vs కుశాల్ ఆర్మి

” ఏంది భయ్యా రోజూ నీ ప్రవచనాలు జనాలకు. మరీ హడావుడి చేస్తున్నావు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనకండి. ఎవడి పని వాడు చేస్తున్నాడు. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా. ప్రతి రోజూ పెద్ద సత్యసాయిబాబా లాగా జనాలకు క్లాస్ పీకడం ఎందుకు?” అని ఒకరు ట్విట్టర్ లో మంచు మనోజ్ కు కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది..మంచు మనోజ్ ని అంతలా వెటకారం చెయ్యటానికి కారణం ఏమిటో చూద్దాం.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కుశాల్ ఆర్మి తమ పోస్ట్ లతో,కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇప్పుడు కుశాల్ ఆర్మికి నానికి పడటం లేదు. దాంతో వాళ్లు నాని లేటెస్ట్ సినిమా దేవదాస్ కు సపోర్ట్ ఇవ్వటం లేదు. ఈ నేపధ్యంలో దేవదాస్ సినిమా చూడండి అంటూ మంచు మనోజ్ పోస్ట్ పెట్టాడు.

మంచు మనజో తన పోస్ట్ లో .. “దేవ్ అండ్ దాస్ థ్రిల్లింగ్ కాంబో! ఈ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉంది. రోజు రోజుకు యంగ్ గా మారుతున్న నాగార్జున గారికి..  నాని బాబాయ్ కి .. దేవదాస్ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్” అని అన్నాడు. దాంతో  కౌశల్ ఆర్మీ మండి పడ్డారు. ఒకరు “ఏం థ్రిల్లింగ్ భయ్యా… మీరు ఈ కామెంట్స్ చేసి మా కౌశల్ ఫ్యాన్స్ ను హర్ట్ చేశారు” అన్నారు.

దానికి మంచు మనోజ్ రిప్లై ఇస్తూ “సినిమా అంటే ఒక్కరిది కాదు తమ్ముడూ. ఎంతో మంది ఆకలి కష్టం. ఎన్నో డిపార్టుమెంట్లు రాత్రి పగలు ఫ్యామిలీస్ ని వదిలి పని చేస్తారు. ఈ నెగెటివ్ థాట్స్ అన్నీ వదిలేయండి. అందమైన తెలుగు సినిమాను ఎంజాయ్ చేయండి. ప్రతి యాక్టర్.. టెక్నీషియన్ ను ప్రేమిద్దాం.. గౌరవిద్దాం” అన్నాడు.

దీనికి కౌశల్ ఆర్మీలో ఒకరు “మనోజ్ గారు.. మాకు కూడా మనీ ఊరికే రావడం లేదండి.. కష్టపడితేనే వస్తుంది మీ అందరి సినిమాలు చూడటానికి. ఒకరి కష్టం గురించి ఆలోచించే వ్యక్తి వేరే వాళ్లని చులకనగా మాట్లాడరు. నాని గౌరవం కోల్పోయాడు” అన్నాడు.

అక్కడితో ఆగకుండా.. మరో కౌశల్ ఆర్మీ వ్యక్తి… “మనోజ్ భయ్యా… ఈ విషయంలో అనవసరంగా దూరొద్దు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. తారక్ అన్న ఫ్రెండుగా మీపై గౌరవం ఉంది. బిగ్ బాస్ లో నాని చేస్తుంది తప్పు. దానికి అతడు అనుభవించాలి. కౌశల్ ఆర్మీని లైట్ తీసుకుంటే అందరూ త్వరలోనే అనుభవిస్తారు” అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.