స‌ముద్రంలో తిమింగలంతో హాటీ సాహ‌సం

బులుగు జిలుగు స‌ముద్రంలో ఎట్నుంచి ఏ ప్ర‌మాదం పొంచి ఉందో చెప్ప‌గ‌ల‌మా? కానీ ఈ అమ్మ‌డు మాత్రం అలాంటి వాటికి భ‌య‌ప‌డ‌దు. నేరుగా తిమింగ‌ళంతోనే స్నేహం చేసి దాంతోనే ఈత కొట్టి బెంబేలెత్తించింది. చూస్తుంటేనే గ‌గుర్పొడిచే ఈ ఫీట్ వేసి ఔరా అనిపించింది క‌త్రిన‌. ఈ భామ తాజాగా త్రోబ్యాక్ వీడియో అంటూ ఓ పాత వీడియోని షేర్ చేసింది.

ఈ వీడియోలో రెండు టన్నుల బ‌రువు ఉండే భారీ తిమింగ‌లంతో ఈత కొడుతోంది. బ్లూ సీలో ఈదేప్పుడు తెల్ల‌ని ఈత దుస్తుల్ని ధ‌రించింది క‌త్రిన‌. అయితే తాను ఇలా ఈత‌కు వెళ్లే ముందే నిపుణుల స‌మ‌క్షంలో శిక్ష‌ణ పొందింద‌ట‌.

అక్ష‌య్ స‌ర‌స‌న క‌త్రిన సూర్య‌వ‌న్షీ అనే చిత్రంలో న‌టించింది. లాక్ డౌన్ వ‌ల్ల రిలీజ్ స‌మ‌స్య త‌ప్ప‌డం లేదు‌. ఫోన్‌బూత్ అనే చిత్రం‌లో ఇషాన్ ఖత్త‌ర్ – సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి క‌త్రిన ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువ‌డాల్సి ఉంది.