‘ఆర్ ఎక్స్ 100’ హీరో కొత్త చిత్రం టైటిల్ వివాదం

ఈ మధ్యకాలంలో టైటిల్ వివాదం అనేది చాలా కామన్ అయ్యిపోయింది. టాలీవుడ్ లో నిర్మించే చిత్రాలకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ రెండు ఉండటంతో…ఎవరికి కావాల్సిన చోట వాళ్లు టైటిల్ రిజిస్ట్రేషన్స్ చేయించుకుంటున్నారు. దాంతో చాలా సార్లు ఒకే టైటిల్ రెండు చోట్ల రిజిస్టర్ అవుతోంది. ఈ నేపధ్యంలో వివాదాలు మొదలు అవుతున్నాయి. ఇప్పుడు అదే పరిస్దితి కార్తికేయ చిత్రానికి ఎదురైంది.

వివరాల్లోకి వెళితే..’ఆర్ ఎక్స్ 100′ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న కార్తికేయ, ప్రస్తుతం ‘హిప్పీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన ‘గుణ 369’ అనే టైటిల్ తో మరో ప్రాజెక్టును ను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. టైటిల్ బాగుందనే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ టైటిల్ విషయంలోనే వివాదం తలెత్తింది.

క‌ళాధ‌ర్ కొక్కొండ న‌టిస్తూ , స్వీయ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం గుణ‌. న‌టులు సెల్వ‌రాజ్ , దిల్ ర‌మేష్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.. స‌నాతన క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపోందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.. కాగా గుణ టైటిల్ ని ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కొత్త సినిమాకు పెట్ట‌డం పై గుణ చిత్రం న‌టుడు ,ద‌ర్శ‌క‌నిర్మాత క‌ళాధ‌ర్ కొక్కొండ మండిప‌డుతున్నారు.

ఇదివ‌ర‌కే గుణ టైటిల్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు తెలిపారు.. తమ సినిమా టైటిల్ ను అర్జున్ జంధ్యాల టీమ్ వాడుకుంటూ .. ఆ టైటిల్ పక్కన ‘369’ అంకెను తగిలించ‌డం పై కళాధర్ కొక్కొండ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు ఎపి ఫిల్మ్ ఛాంబ‌ర్ లో కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు..త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌ని అన్నారు…ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.