కొన్ని ప్రేమలు పెళ్లి వరకూ వెళ్లవు. మధ్యలోనే ఆ బంధం వీగిపోతుంది. అదీ బాలీవుడ్ లో డేటింగ్ వరకే పరిమితం. పెళ్లిళ్లకు దారి తీయడం చాలా అరుదు. అయితే విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు..విమర్శలు చేసుకోవడం కూడా రేర్ గానే జరుగుతుంది. అయితే కంగనా రనౌత్ మాత్రం ఎఫైర్లు నెరపడంలో ఎంత స్పీడ్ గా ఉంటుందో? బ‌్రేకప్ చెప్పిన తర్వాత అతన్నో శత్రువులా భావించి విమర్శించడం అమ్మడికి బాగా అలవాటు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ విషయంలో కంగన చేసిన రాద్ధంతం గురించి తెలిసిందే. అంతకు ముందు కెరీర్ ఆరంభంలో కంగన ఆధ్యాయన్ సుమన్ ని ప్రేమించింది.
ఇద్దరు చాలా కాలం చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఆ జంట అన్యోన్యతను చూసి పెళ్లి బంధంతో ఒకటి కావడం ఖాయమని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ జంట మధ్య అనుకోని మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. ఆ సమయంలో కంగన సహా రంగోలి సుమన్ పై తీవ్ర విమర్శలు…ఆరోపణలు చేసారు. సుమన్ పచ్చి మోసగాడంటూ ఫోకస్ చేసే ప్రయత్నం చేసారు. అయితే సుమన్ మాత్రం ఎలాంటి కౌంటర్ వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా ఆయన కొన్నేళ్ల తర్వాత ఈ బ్రేకప్ గురించి మాట్లాడారు. కంగనతో విడిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉందని…. లేదంటే జీవితాంతం నరకం అనుభవించేవాడనినని అన్నారు.
సుమన్ వల్ల అతని కుటుంబం కూడా ఎంతో క్షోభకు గురైందని…అప్పటి పరిస్థితులను తలుచుకుంటే భయమేస్తుందన్నారు. అయితే అప్పట్లో నన్ను విమర్శించిన వాళ్లు క్షమాపణలు చెబుతారని నేను ఎప్పుడూ ఎదురు చూడను. నా పని నేను చూసుకుంటు వెళ్లిపోతా. అయితే అప్పట్లో సుమన్ పై కంగన అండ్ సిస్టర్ చేతబడి చేయించారని మరోసారి గుర్తు చేసుకున్నాడు. అన్ని రకాలుగాను ఆ సిస్టర్స్ తన జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్లు ఉన్నారని ఆయన ఆవేదన చెందాడు.