నిజమే ఏ పని చేయాలన్నా ముందు కసి పట్టుదల ఉండాలి. ఆ రెండు లక్షణాలు లేనిది ఏ పని అంత ఈజీ కాదు. అందులోనూ డబ్బు సంపాదించాలంటే కసి పట్టుదలతో పాటు, అంతకు మించి తెలివి తేటలు కూడా అంతే అవసరం. మేధావితనానాకి కసి పట్టుదల తోడైతేనే డబ్బు సంపాదన మార్గాలు కనిపిస్తాయి. అవి లేకుండా ఊగితే ఉన్న గోచీ కూడా ఊడిపోతుంది. తాజాగా డబ్బు సంపాదించాలన్న తనకున్న కసిని ఓ రేంజ్ లో చెప్పుకొచ్చింది బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్. కంగన ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా సినిమాల్లోకి వచ్చి నేడు స్టార్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకుంటుంది. అయితే ఆమె గతం చాలా దుర్భరమైనది.
ఓ సాధారణ గ్రామం నుంచి ముంబైకి వచ్చి హీరోయిన్ అయింది కంగన. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు.. అవమానాలు ..అవస్థలు ఎదుర్కుంది. కానీ ఏనాడు టార్గెట్ విడిచిపెట్టలేదు. తను కన్న కలల లోకంలో విహరించాలనుకుంది. ఆ దిశగానే అడుగులు వేసి సక్సెస్ అయింది. ఆరంభం నుంచి సక్సెస్ అయ్యే వరకూ కసితోనే పనిచేసి బాలీవుడ్ క్వీన్ గా ఎదిగింది. ఇక స్టార్ గా ఎదిగిన తర్వాత నటుడు హృతిక్ రోషన్ తో ప్రేమ వ్యవహరం…అది బెడిసికొట్టి తర్వాత ఎదుర్కున్న కోర్టు ఇబ్బందులు తెలిసిందే. హృతిక్ తో రిలేషన్ చెడిన తర్వాత అమ్మడి కెరీర్ పై ఒక్కసారిగా ప్రతికూల వాతావరణ ప్రభావం పడింది.
కొన్ని సూటిపోటి మాటలను ఎదుర్కుంది. డబ్బు కోసమే హృతిక్ కు వల వేసింది లాంటి నిందలు మోసింది. అయితే ఇప్పుడు హృతిక్ అద్దె ఇంట్లో ఉంటే..తాను మాత్రం సొంత బంగాళాలో విలాస వంతమైన జీవితం గడుపుతున్నాన్నారు. తనకు 50 ఏళ్లు వచ్చేసరికి ఇండియాలో ధనవంతులలో ఒకరిగా ఉండాలంటోంది. తన లక్ష్యం అదేనంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది. అయితే ఇలాంటి పట్టుదలకు కారణం కేవలం పరిస్థితులేనని తెలిపింది. పరిస్థితులు మనిషిని ఎంత దూరమైనా, ఏం చేయడానికైనా ప్రేరేపిస్తాయని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది.