రకుల్ టాపిక్ మర్చిపోయేలా.., హరికృష్ణ లుక్ వదిలారు!

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్‌టిఆర్‌’ చిత్రం రోజుకో వార్త లేదా ఫొటోతో సెన్సేషన్ గా మారింది. రీసెంట్ గా ఈ చిత్రంలో శ్రీదేవి గా చేస్తున్న రకుల్ ఫొటోని వదిలితే …రకరకాల విమర్శలు వచ్చాయి. శ్రీదేవి కాదు శ్రీరెడ్డి అంటూ వెటకారం చేసారు.

ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ లుక్ న వదిలారు. ఆ పాత్రను హరకృష్ణ కుమారుడు …నందమూరి కల్యాణ్‌రామ్‌ పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫొటోను కల్యాణ్‌రామ్‌ అభిమానులతో పంచుకున్నారు.
 

‘‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు.. బాబాయ్.. వాళ్ల నాన్న గారిలా… నేను, మా నాన్నగారిలా’’ అంటూ ప్రచారం రథం దగ్గర ఎన్టీఆర్‌(బాలకృష్ణ)తో కలిసి వెనక్కి తిరిగి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోకు మంచి రెస్పాన్సే వస్తోంది. హరికృష్ణ లుక్ సక్సెస్ తో రకుల్ మీద వచ్చిన విమర్శలను సైడ్ చేసినట్లు ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది.


ఇక ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్‌, చంద్రబాబుగా దగ్గుబాటి రానా, అక్కినేనిగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌
తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు
సమకూరుస్తున్నారు. ‘యన్‌టిఆర్‌’ను బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. జనవరి 9న కథానాయకుడు, జనవరి 24మహానాయకుడుగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.