కుర్ర బ్యూటీ గేమ్స్ ఆడుతోంది
పెళ్లాడతాను.. కానీ ఎవరిని అన్నది చెప్పను! అంటూ పరాచికం ఆడుతోంది ఈ కుర్ర బ్యూటీ.. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే.. హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ గురించే. ఈ భామ కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని ప్రచారం అవుతోంది. మోహన్ లాల్- ప్రియదర్శన్ కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. ఆ ఇద్దరూ కాలేజ్ రోజుల నుంచి మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్ లో 43 చిత్రాలు తెరకెక్కాయి. దీంతో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్- ప్రియదర్శన్ కుమార్తె కల్యాణిల మధ్య బాల్యం నుంచే స్నేహం కొనసాగింది. ఆ స్నేహమే ఇప్పుడు ప్రేమగా మారిందని మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై కళ్యాణిని ప్రశ్నించగా తెలివిగా బదులిచ్చింది.
నేను ఒకరిని ప్రేమిస్తున్న మాట నిజం. భవిష్యత్ లో అతడిని పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నానన్న విషయం నా కుటుంబ సభ్యులకు తెలుసు. మా ప్రేమకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఆ వ్యక్తి వివరాలు ఇంకా చెప్పనని తెలిపింది. దీంతో ఆ చెలికాడు ప్రణవ్ అనే అందరికీ సందేహం. తాజాగాఈ జంట ప్రేమకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. ఇద్దరు కలిసి తిరుగుతోన్న ఫోటోలు, సన్నిహితంగా మెలిగిన ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కళ్యాణి మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నారు. హిస్టారికల్ పాన్ ఇండియా బేసిస్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు టాప్ స్టార్లు నటిస్తున్నారు. కళ్యాణి అతిధి పాత్రలో నటిస్తోంది. ఇటీవల శర్వా సరసన రణరంగంలో నటించింది. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.