క‌ళ్యాణ్ రామ్ ‘118’ స్టోరీ..టాక్

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘118’ ఈ రోజు విడుదల అయ్యింది. ఈ సినిమా ద్వారా దర్శకుడుగా ప్రముఖ కెమెరామెన్ కేవీ గుహన్ పరిచయం అవుతున్నారు. సాలీడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ఎంతో కీలకమైనటంలో సందేహం లేదు.

ఈ సినిమాలో సూప‌ర్ నేచుర‌ల్ అంశాలేవీ ఉండ‌వు.. కానీ థ్రిల్ కి గురి చేస్తుంద‌ని క‌ళ్యాణ్ రామ్ ఇప్పటికే చెప్పారు. అలాగే నివేద థామస్ చివ‌రి 20 నిమిషాలు మాత్ర‌మే క‌నిపిస్తుంది. అయినా ఆ పాత్ర చుట్టూనే క‌థంతా తిరుగుతుంద‌ని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి… టాక్ ఏంటో క‌థేంటో చూద్దాం.

కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో ఓ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టు . అతడిని ఓ కల వెంటాడుతూంటుంది. అత‌డికి వచ్చే క‌ల‌లు చాలా వరకూ నిజం అవుతూంటాయి. ఆ కలల్లో అతని సిక్స్త్ సెన్స్ ప‌ని చేస్తుంటుంది. అలా అత‌డు ఓ సారి ఓ హోటల్ లో 118 నెంబర్ రూమ్ లో 1.18 ఏఎంకి ఓ క‌ల‌గ‌ంటాడు. ఆ కల చాలా వింతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కల ఓ అమ్మాయికి సంబంధించినది. ఆమెని ఎవ‌రో చంపేస్తారు. అది ఎక్క‌డ జ‌రిగింది? ఎలా జ‌రిగింది? అన్న పాయింటాఫ్ వ్యూలో కేవలం కలను నమ్ముకుని ప‌రిశోధ‌న సాగిస్తుంటాడు కళ్యాణ్ రామ్. ఆ క‌ల‌ అత‌డికి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌వు.

ఆ క‌ల లో త‌న‌కు క‌నిపించిన‌దానిని తెలుసుకునేందుకు చేసే ప్ర‌య‌త్నం ఎంతవరకూ నిజమైంది అన్న‌దే సినిమా. ఇంట్రస్టింగ్ గా ఈ ఇన్విస్టిగేషన్ లో ఓ మాఫియా గ్యాంగ్ బ‌య‌ట‌ప‌డుతుంది. ఆ గ్యాంగ్ చిన్న పిల్ల‌ల‌కు ప్ర‌మాద‌క‌ర ఇంజెక్ష‌న్లు ఇచ్చి ప్ర‌యోగాలు చేస్తుంటుంది. పిల్ల‌లు ఆ ఇంజెక్ష‌న్లు తో చనిపోతూంటారు. ఆ క్ర‌మంలోనే అదే హోట‌ల్ అదే 118 రూమ్ లో నివేద థామ‌స్ హ‌త్య‌కు చేసేస్తారు. అందుకే అత‌డిని ఆ పీడ‌క‌ల‌లు వెంటాడుతుంటాయి. అది తెలుసుకున్న కళ్యాణ్ రామ్ ఆ మాఫియా అంతు చూసేందుకు ఏం చేశాడ‌న్న‌దే సినిమా.

కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేద థామస్.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.