‘118’ టీజర్‌ వచ్చేసింది..ఆ టైమ్ కే ప్రమాదం

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరో గా చేస్తున్న తాజా చిత్రం ‘118’.ప్రముఖ కెమెరామెన్ కే.వి గుహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈస్ట్‌ కోస్ట్‌‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

118 Teaser - Nandamuri Kalyan Ram, Nivetha Thomas, Shalini Pandey | 4K

కల్యాణ్‌ రామ్‌, షాలిని పాండేల లవ్‌స్టోరీతో టీజర్‌ మొదలైంది. ‘ఆ రోజు వరకు..’ అని చూపిస్తూ 1.18 గంటల సమయంలో ఏదో ప్రమాదం జరగడాన్ని చూపించారు. ఆ ప్రమాదం ఏంటి? ఎవరు చేశారు? అన్న విషయాన్ని కల్యాణ్‌రామ్‌ కనిపెట్టేందుకు ప్రయత్నించటమే కథలా ఉంది.

టీజర్‌ను బట్టి చూస్తే ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలా అనిపిస్తోంది. శేఖర్‌ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.