వివాదాలతో వార్తల్లో నిలవటం అలవాటుగా చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రంకు సంగీతంను కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో పాటల కంటే ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా ముఖ్యమని – అందుకే ఈ చిత్రం కోసం కళ్యాణి మాలిక్ ను వర్మ తీసుకున్నట్లుగా చెప్తున్నారు.
ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో కళ్యాణ్ మాలిక్ సోషల్ మీడియాలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన మణికర్ణికపై చేసిన కామెంట్స్ అంతరా చర్చనీయాంశంగా మారాయి.
ఓ ప్రక్కన క్రిష్ తనను మణికర్ణిక హీరోయిన్ దెబ్బ కొట్టిందంటూ మీడియాలో ఇంటర్వూలు ఇచ్చిన సమయంలో … మణికర్ణిక చాలా బాగుందని, ఇది ఇండియన్ సినిమాకు గర్వకారణమైనందని, ముఖ్యంగా సెకండాఫ్ చాలా బ్రిలియెంట్ గా ఉందని, ఎవరు డైరక్టర్ చేసారనేది మ్యాటరే కాదని, హైలీ ఎమోషనల్ , డోంట్ మిస్ అంటూ పోస్ట్ చేసారు. సహజంగానే ఈ పోస్ట్ చూస్తే క్రిష్ కు కాలుతుందనటంలో సందేహం లేదంటున్నారు సినిమా జనం.
ఇక ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన అసలు విషయాలను తాను చూపిస్తానంటూ చెబుతూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ రెగ్యులర్ షూటింగ్ సైలెంట్ గా చేస్తూ…ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదలటం ప్రారంభించాడు. మెల్లిమెల్లిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం హాట్ టాపిక్ మారింది. ఇక అసలు విషయానికి వస్తే..ఈ చిత్రంకు సంగీతంను కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో పాటల కంటే ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా ముఖ్యమని – అందుకే ఈ చిత్రం కోసం కళ్యాణి మాలిక్ ను వర్మ తీసుకున్నట్లుగా చెప్తున్నారు. మరో ప్రక్క బాలకృష్ణ – క్రిష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ రెండు పార్ట్ లకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే. కీరవాణి సోదరుడు అయిన కళ్యాణ్ మాలిక్ తో వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంగీతం చేయించడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ మొదటి పార్ట్ కథానాయకుడు రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.