రీసెంట్ గా సీతగా ప్రేక్షకులను పలకరించిన కాజల్ అగర్వాల్ …ఆ సినిమా డిజాస్టర్ అవటంతో కొద్దిగా అప్ సెట్ అయినట్లు కనపడినా తిరిగి రొటీన్ లో పడ్డారు. అందులో భాగంగా ఫిట్నెస్ ఛాలెంజ్ కు రెడీ అంటున్నారు. వంద రోజుల్లో ఫిట్‌గా మారిపోవాలని కాజల్ నిశ్చయించుకున్నారు. అందుకే ఈ చాలెంజ్ కూడా టేకప్ చేశారు. ఈ విషయాన్ని ఇనిస్ట్రగ్రమ్ ద్వారా తన అభిమానులకు తెలియచేసారు.
కాజల్ మాట్లాడుతూ – ‘‘యాక్టర్సే కాదు అందరూ ఫిట్‌గా ఉండాలి. నా శరీరాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ చాలెంజ్ తీసుకుంటున్నాను. నా కోచ్ శ్రీరామ్ పర్యవేక్షణలో దీన్ని మొదలుపెడుతున్నాను.
ఏం తినాలి? ఏ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి? అనేవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. వాటిని కూడా చాలా తేలిక చేస్తున్నారు ఆయన. ఈ చాలెంజ్‌లో అసహజత్వానికి చోటే లేదు. కేవలం న్యాచురల్‌గా లభించే న్యూట్రిషన్స్‌తోనే ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నాను. ఎలాంటి మార్పు కనిపిస్తుందో వంద రోజుల్లో చూద్దాం’’ అని పేర్కొన్నారు.