మర్చిపోకు..  కాజల్ భుజం మీదే నువ్వు ఎక్కావ్ బాబూ…

సీనియర్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగర్వాల్ ని మోస్తూ యంగ్ హీరో   బెల్లంకొండ శ్రీనివాస్ వదిలిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వెబ్ మీడియా ఈ ఫొటోని మోస్తూ పబ్లిసిటీ చేస్తోంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం కంబోడియా వెళ్లిన వీళ్లు అక్కడిలా ఫోజులు ఇచ్చారు. సరదా కోసం ఫొటో దిగి, పబ్లిసిటీ కోసం దాన్ని వాడుతున్న బెల్లంకొండ ని జనం మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఆ విషయం ప్రక్కన పెడితే నిజానికి ఫొటో లో కాజల్ ని బెల్లంకొండ మోస్తున్నాడు కానీ ..ఈ సినిమాని మాత్రం కాజలే మొయ్యాలని చెప్తున్నారు. ఆ విషయం చెప్పి ఒప్పించే తేజ ఆమెను సీన్ లోకి తెచ్చారని, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి అప్ కమింగ్ హీరో సినిమాలో కాస్త నటన వచ్చి, క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బిజినెస్ పరంగానూ బాగుంటుందని తేజ ఇలా ప్లాన్ చేసారట.

ఇక బెల్లంకొండ పోస్ట్ చేసిన ఈ ఫొటోపై జనం… అడ్వాంటేజ్ ఆఫ్ రిచ్ డాడ్, నువ్వు షూటింగ్ చేస్తున్నావా..ఫొటోలు దిగుతున్నావా కాజల్ తో అని మరొకరు..పెళ్లి చేసుకోండి అని వేరొకరు కామెట్స్ చేస్తున్నారు. వాటిని ఈ జంట ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది లెండి.