క్రేజ్ కోసం కాజల్ తిప్పలు..కొండ చిలవతో సరదాలు

ఈ మధ్యకాలంలో కాజల్ అగర్వాల్ కాస్తంత వెనకబడింది. ఇంక పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యిపోతుంది..కెరీర్ ముగిసిపోయింది అనుకున్న టైమ్ లో ఆమె తనను పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు..నేనే మంత్రి చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చింది. దాంతో తిరిగి ఉత్సాహంగా యంగ్ హీరోలతో తన ప్రస్దానం మొదలెట్టింది.మొదలైతే పెట్టింది కానీ తనను మర్చిపోయారేమో అనే డౌట్ వచ్చినట్లుంది. దాంతో రోజుకో రకంగా ఫొటోలు దిగి ఫోజులు పెట్టి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది.తాజాగా ఆమె కొండ చిలవను మెళ్లో వేసుకుని ఫోజులు కొట్టింది. ఇదిగో మీరు ఆ
వీడియోని ఇక్కడ చూడవచ్చు.

కాజల్ …ప్రస్తుతం యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది‌. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది. షూటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసి వార్తల్లో కాజల్ ని నిలిపింది.

కాజల్ .. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు.