కాజల్ క్యారక్టర్ వింటే కంగారుపడాల్సిందే

బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇటీవల ‘సాక్ష్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పంచభూతాలే ‘సాక్ష్యం’ అనే కథాంశంతో  రూపొందిన ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఆయన హిట్ కోసం సీనియర్ దర్శకుడు తేజ తో సినిమా కమిటయ్యారు.   కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ సినిమా  లో కాజల్ పాత్ర విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది.

ఆమె నెగిటివ్ రోల్ లో కనిపించబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఆమె ఓ బిజినెస్ వుమెన్ పాత్రలో కనిపించి అలరించబోతోంది. తన బిజినెస్ కోసం ఆమె తీసుకునే కఠినమైన నిర్ణయాలు ఎలా ఉంటాయి.  అయితే అలాంటి అమ్మాయి …బెల్లంకొండ తో ప్రేమలో పడ్డాక మార్పు వస్తుందిట. ఆ సీన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయంటున్నారు.  ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, సోనూసూద్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క కాజల్‌ బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’లో నటిస్తున్నారు. అలాగే ఆమె సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలోనూ
నటించనున్నారు. ఇందులో రవితేజ  హీరో. కేథరిన్‌ మరో హీరోయిన్.