టాలీవుడ్ చందమామ కాజల్ ప్రస్తుతం తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి కొత్తింట్లో సందడి చేస్తోంది. అయితే మొదటిసారిగా కాజల్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను చెప్పింది. ఎలా కలిశారు ఎలా ప్రేమించుకున్నారు ఎలా పెళ్లి పీటల వరకు వచ్చిందనే విషయాన్ని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ జీవితాన్ని లాక్ డౌన్ పూర్తిగా మార్చేసింది. ఇంట్లో ఐదారు నెలలు ఖాళీగా ఉండటం, బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో కథ ముందుకు సాగినట్టు తెలుస్తోంది.
ఏడేళ్ల స్నేహం, మూడేళ్ల డేటింగ్ లాక్ డౌన్ వల్ల పెళ్లిగా మారినట్టు కాజల్ చెప్పింది. ఆ పదేళ్ల కాలంలో జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్లో తోడుగా ఉన్నాం.. కలిసి ఉన్నాం.. కలిసి ఎదుర్కొన్నాం.. అంతకు ముందు ప్రతీ చిన్నా పెద్దా పార్టీల్లో కలుసుకునే వాళ్లం.. మాట్లాడుకునే వాళ్లం. కానీ లాక్ డౌన్ వల్ల కొన్ని వారాలు కలసుకోలేకపోయాం. అలా ఓ సారి మాస్కులు ధరించి షాపుకు వెళ్లాం. అలా చూసుకున్నప్పుడు కలిసి ఉండాలని మేము రియలైజ్ అయ్యామని కాజల్ పేర్కొంది.
గౌతమ్‌కు సినిమా నాలెడ్జ్ అంతగా లేదు.. రొమాన్స్ గురించి అంతగా తెలియదు.. కానీ నాకు మాత్రం సినిమాల వల్ల ఆ అనుభం ఉంది. ప్రపోజ్ చేసేటప్పుడు సినిమాటిక్ మోకాళ్ల మీద నిలబడి చేయడం వంటివేమీ చేయలేదు.. మనసులో ఉన్నది చెప్పాడు.. భవిష్యత్తులో ఎలా ఉండాలి.. ఏ విధంగా జీవించాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించాడు. ఆ విధానం నాకు నచ్చింది అంటూ అలా పెళ్లి అడుగులు పడ్డాయని చెప్పింది. గౌతమ్ మా ఇంట్లో పెద్ద వాళ్లతో మాట్లాడాడు. జూన్‌లో నిశ్చితార్థమైందంటూ కాజల్ తన పెళ్లి వెనుకున్న రహస్యాలను చెప్పింది.