30 నిమిషాల పాత్రకు కోటి రూపాయలా?

30 నిమిషాల పాత్రకు కోటి రూపాయలా?

అందాల ‘చందమామ’ కాజల్ అగర్వాల్  మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తో పాటు,  కమల్ ‘ఇండియన్ 2’ వంటి బిగ్గెస్ట్ భారీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే.. రానా నటించిన పాన్ ఇండియా మూవీ హాతీ మేరీ సాతి. ఈ చిత్రంలో రానాతో పాటు కాజల్ కూడా నటించారట.ఈ చిత్రంలో కాజల్ ది గెస్ట్ రోల్ గా చెబుతున్నారు.

సినిమాలోని కీలకమైన గిరిజన యువతి పాత్రను కాజల్ చేశారట. గిరిజన యువతి పాత్ర అవ్వడంతో బ్లౌజ్ లేకుండా చీర కట్టుకుతోనే కాజల్ కనిపిస్తుందట. దాదాపు ముప్పై నిమిషాల స్క్రీన్ ప్రజెన్సు ఉండే కాజల్ ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందట. కాజల్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమాకు ఆమె పాజిటివ్ గా నిలుస్తుందనే నమ్మకంతో   ఆమెను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా 30 నిమిషాల పాత్రకు కోటి రూపాయలా? అని అనుకుంటున్నారంతా!? అవును మరి  మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తో పాటు,  కమల్ ‘ఇండియన్ 2’ వంటి బిగ్గెస్ట్ భారీ చిత్రాల్లో నటిస్తోంది కదా.. ఆ మాత్రం డిమాండ్ చేయడము సబబే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.