మురుగదాస్‌ ఒప్పుకోలేదు… అందుకే నేను తప్పు చేశా

గత కొద్ది రోజులుగా సర్కార్ సినిమా కాపీ వివాదం తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దక్షిణ చిత్ర పరిశ్రమ రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్‌ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్దితి వచ్చింది. దాంతో భాగ్యరాజా వంటి సీనియర్ దర్శకుడు, రచయిత రాజీనామా చేయటమేంటని చాలా మంది ఆయన అభిమానులు భాధపడుతున్నారు..సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇది గమనించిన భాగ్యరాజా వివరణ ఇచ్చారు.

భాగ్యరాజ్‌ మాట్లాడుతూ.. ‘ఈ కాపీ వివాద సమస్య ను కోర్టుకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించుకోమని దర్శకుడు మురుగదాస్‌ను కోరటం జరిగింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. వేరే ఆప్షన్ లేక సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ‘సర్కార్‌’ కథను బయటపెట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో నేను తప్పు చేశా.. అందుకే సన్‌ పిక్చర్స్‌కు క్షమాపణలు చెప్పా. ఇప్పుడు దక్షిణ చిత్ర పరిశ్రమ రచయితల సంఘం అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశా’ అని అన్నారు. అయితే రాజీనామా లెటర్ ను ఏక్సెప్ట్ చేయమని సంఘం జనరల్‌ సెక్రటరీ మనోజ్‌ కుమార్‌ మీడియాతో పేర్కొన్నారు.

 

అసలేం జరిగింది..

‘సర్కార్‌’ కథ వివాదంలో భాగ్యరాజా… రచయిత వరుణ్‌ రవీంద్రన్‌కు మద్దతు తెలిపారు. వరుణ్‌ చాలా ఏళ్ల క్రితం ‘సర్కార్‌’ సినిమా లాంటి కథను నమోదు‌ చేయించుకున్నారని ఆయన చెప్పారు. తను రాసుకున్న కథతో మురుగదాస్‌ ‘సర్కార్’ సినిమా తీశారని వరుణ్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీనికంటే ఆయన ముందు భాగ్యరాజ్‌ను కలిశారు. పిటిషన్‌ వేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. వరుణ్‌కు మద్దతు తెలిపే క్రమంలో భాగ్యరాజ్ రెండు కథలను బయటపెట్టారు. ఈ కారణంగా భాగ్యరాజ్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.