తమ మొదటి సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకోవడం దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఏ అప్ కింగ్ హీరోయిన్ కి అయినా కూడా పెద్ద సవాల్ అని చెప్పాలి. అయితే హిందీ సినిమాలో పరిచయం అయ్యి అక్కడ పెద్ద సక్సెస్ అందుకోకపోయిన మన తెలుగు సినిమా దగ్గర ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం “సీతారామం” లో సీతగా కనిపించిన ఈమె మన టాలీవుడ్ లో సీతగా స్థిరపడిపోయింది. దీనితో మృణాల్ ని మరిన్ని సినిమాల్లో చూడాలి అనుకుంటున్నా ఆడియెన్స్ కి ఈ యంగ్ హీరోయిన్ మరింత ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
ఇక ఈ హీరోయిన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చేసింది అలాగే మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇపుడు ఫైనల్ గా తమిళ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. కాగా ఈమెని అయితే కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తన భారీ చిత్రంతో పరిచయం చేయనుండడం విశేషం.
అయితే మురుగదాస్ కూడా చాలా కాలం గ్యాప్ తీసుకుని సినిమా చేస్తుండగా ఈ సినిమాలో హీరోగా అయితే శివ కార్తికేయన్ నటించనున్నాడు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో అయితే మృణాల్ ఇప్పుడు తమిళ సినిమాకి పరిచయం అవుతుందట. అలాగే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడట. మొత్తానికి అయితే ఓ అదిరే కాంబినేషన్ లో మృణాల్ కోలీవుడ్ సినిమాకి వెళ్లబోతుంది అని చెప్పాలి.