టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ప్రొడక్షన్ వైపు అడుగులు వేయడం అనేది చాలా కామన్. ఇంటికొక ప్రొడక్షన్ బ్యానర్ లు అయితే ఉన్నాయి. హీరోలు డైరెక్ట్ గా కాకపోయినా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు అలా నడిపించేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఒక బ్యానర్ సెట్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మొదట సినిమాను నిర్మిస్తాడేమో అనుకుంటే ఊహించని విధంగా ఒక టాక్ షోను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు.
బిగ్ బాస్ ఇచ్చిన అనుభవంతో త్వరలోనే ఒక టాక్ షోను స్టార్ట్ చేయనున్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక స్పెషల్ సెట్ ను కూడా నిర్మించడానికి పనులు కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. సొంత డబ్బుతోనే తారక్ షో కోసం ఖర్చు చేయడానికి కూడా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అసలైతే జెమిని టీవీ వల్లే మంచి రెమ్యునరేషన్ ఇచ్చి షోను స్టార్ట్ చేయాలని అనుకున్నారు.
కానీ అలా కాకుండా ఎన్టీఆర్ టేలిక్యాస్ట్ బిజినెస్ మాట్లాడుకొని సొంతంగా నిర్మించేందుకు ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఇతర ప్రొడక్షన్ అంటేనే ఎన్టీఆర్ ప్రాణం పెట్టేస్తాడు. ఇక సొంత ప్రొడక్షన్ అంటే ఇంకెంత సీరియస్ గా తీసుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షో ద్వారా తారక్ ఎదో గట్టి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ హీరో RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. షో మాత్రం వచ్చే ఏడాది జనవరి అనంతరం మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్.