నిహారిక కొణిదెల .. ఈ పేరు మొన్నటివరకు కానీ , ఇప్పుడు నిహారిక జొన్నలగడ్డ. మెగా వారి అమ్మాయి ఇప్పుడు జొన్నలగడ్డ వారి కోడలుగా మారింది. ఈమె వివాహాం చైతన్య జొన్నలగడ్డతో ఈనెల 9న అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఇంటి పేరు మారాకా నిహారిక సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్ ఇది. ఈ సందర్భంగా నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ తన భార్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు.
నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. సూర్య కాంతితోనే సన్ ఫ్లవర్ వికసిస్తోంది. అలాగే నిహారిక తన జీవితంలో అడుగుపెట్టడంతో నా జీవితం కూడా వికిసించిందని కవితాత్మకంగా వివరించాడు.
డిసెంబర్ 18న నిహారిక పుట్టిన రోజు. ఎపుడు తల్లి తండ్రులు సోదరుడుతో పుట్టినరోజు వేడుకలు చేసుకునే ఈ మెగా ప్రిన్సెస్ తొలిసారి భర్తతో కలిసి తన బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది.