బసిరెడ్డి పాత్ర చాలాకాలం గుర్తుంటుంది .జగపతి బాబు

“అరవింద సామెత వీర రాఘవ ” చిత్రంలో తాను పోషించిన బసి రెడ్డి పాత్ర ప్రేక్షకుల్లో చాలా కాలం గుర్తుండి పోతుందని, ఆ పాత్రను త్రివిక్రమ్
శ్రీనివాస్ మలచిన తీరు అపూర్వమని జగపతి బాబు చెప్పాడు. శనివారం నాడు ఆయన మాట్లాడుతూ. ఈ చిత్రం విడుదలైనప్పుడు తానూ సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం జార్జియాలో వున్నానని  చెప్పారు. అయితే అక్కడ వున్నా తన మనసు ఇక్కడే ఉందని, ఎప్పటికప్పుడు సినిమా టాక్, కలెక్టన్స్ తెలుసుకుంటూనే వున్నానని  చెప్పారు. ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రంతో తన ఆనందాన్ని ఫోన్లోనే పంచుకున్నానని చెప్పారు. అరవింద సమేత సినిమా ఇంత గొప్ప విజయం సాధిస్తుందని అనుకోలేదని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ
రధం పట్టారు. జార్జియాలో ఈ చిత్ర విజయాన్ని మిత్రులతో పంచుకున్నానని ఆయన తెలిపారు.

బసిరెడ్డి చాలా క్రూరమైన పాత్రని, సినిమా షూటింగ్ లోనే తనకా విషయం అర్థమైందని జగపతి బాబు తెలిపారు. తెరపైన ఆ పాత్రను చూసుకుంటే  తనకే ఆశర్యం, భయం వేసిందని ఆయన చెప్పారు. ఆ పాత్రను చూసి చాలా మంది శాపనార్ధాలు పెట్టారు. అవ్వన్నీ నటుడుగా తనకు ఆశీర్వాదాలు అనుకున్నానని చెప్పారు. ఈ చిత్రంలో నటించిన ఎన్టీఆర్ తనని అన్నివిధాలుగా ప్రోత్సహించారని, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధా కృష్ణ కు కూడా ఈ సందర్భంగా కృతాజ్ఞతలు తెలియ జేస్తున్నానని చెప్పారు.