ఓవర్సీస్ లో వర్క్ఔట్ అవ్వలేదు పూరి మాస్ మంత్రం !

పూరి జగన్నాథ్ మాస్ ట్రీట్మెంట్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి బాగా నచ్చింది. బి, సి సెంటర్ల లో తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రామ్ కెరీర్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు ఖాతాలో పడుతున్నాయి. నాలుగు రోజులు గాను తెలుగు రాష్ట్రాల్లో రూ 21.42 కోట్లు రాబట్టిందీ చిత్రం. ఇక్కడ ఇంతా బాగా ఆడుతున్నా ఓవర్సీస్ ప్రేక్షకుల మీద మాత్రం ఈ మాస్ శంకర్ అంతగా వర్క్ ఔట్ అవ్వలేదు . ప్రీమియర్ల ద్వారా 51,677 డాలర్లను, గురువారం 31,893, శుక్రవారం 41,579, శనివారం 56,898 డాలర్లును రాబట్టిన ఈ సినిమా మూడు రోజులకు కలిపి 183,338 డాలర్లను మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఏపీ, తెలంగాణలో వసూళ్ళకి ఈ వసూళ్లకు చాలా తేడా ఉంది. దీనిబట్టి అమెరికా లో తెలుగు ఆడియన్స్ పూరి నుండి కొత్తదనాన్ని ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. పైగా చిత్రాన్ని అమెరికా లో ఈ తరహా సినిమాలు క్లిక్ అవ్వటం కష్టం తక్కువ లొకేషన్స్ లో విడుదల ఈ వసూళ్లు తగ్గడానికి మరొక ప్రధాన కారణం.