మహానటి సావిత్రి మనవడు హీరోగా చిత్రం

మహానటి సావిత్రి మనవడు హీరోగా చిత్రం

మహానటి సావిత్రి మనుమడు అభినయ్ వడ్డి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అతను నటుడే. తనెవరో తెలీయకుండా దాసరి దర్శకత్వంలో “యంగ్ ఇండియా”కు ఎంపికై, నలుగురు హీరోల్లో ఒకరిగా పనిచేశాడు. ఆ తర్వాత ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇప్పుడు ఓ ఎడ్వంచర్ థ్రిల్లర్ తో మరోసారి పలకరిస్తున్నారు.

ఈ సినిమాలో అభినయ్ తో పాటు త్రిష,సిమ్రాన్ లు కూడా కలిసి పనిచేస్తున్నారు. అభినయ్ ఓ స్మిమ్మర్ గా కనిపిస్తారు. ఆయనకు జోడీగా సిమ్రాన్ చేస్తన్నారు. త్రిష ఓ స్నేహితురాలిగా ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. వీళ్లు ముగ్గురూ కలిసి ఓ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయటం కథాంశంగా తెరకెక్కుతోంది. ఆర్కే అనే తమిళ దర్శకుడు ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.

ఇక అభినయ్ కు తమిళంలో తన జెమినీగణేష్ ద్వారా కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌లోనూ మా అమ్మ, అక్క రేఖ నుంచి ఆఫర్లు వచ్చాయి. బొంబాయి వచ్చేయ్ నేను చూసుకుంటానంది. కానీ అమ్మమ్మను ఆదరించిన టాలీవుడ్‌లోనే హీరోగా గుర్తింపు పొందాక ఇతర ఫీల్డులకు వెళతాను అని అభినయ్ చెప్తున్నారు.

విజయ చాముండేశ్వరి కుమారుడైన అభినయ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ తన టాలెంట్‌ను నమ్ముకు ని ముందుకు వెళ్తున్నారు. మరి అలనాటి నటి సావిత్రి మనుమడు టాలెంట్ ఏమిటనేది మనం త్వరలో చూస్తామన్నమాట. ఎనీ వే ఆల్ ది బెస్ట్ అభినయ్.