మగాడిలా ఉన్నావని అంటే శ్రుతి ప్లాస్టిక్ సర్జరీ!
అందాల శ్రుతిహాసన్ ముక్కుకు శస్త్ర చికిత్స జరిగిందని, ముఖాకృతి మార్చుకునేందుకు కత్తి గాట్లను ఎదుర్కొందని ఇప్పటికే బోలెడంత ప్రచారం ఉంది. అయితే తనకు ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని చెప్పేందుకు శ్రుతి ఏమాత్రం సంకోచించదు. ముక్కుకు చికిత్స జరిగిందని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో అంగీకరించింది.
అంతేకాదు.. ఇలాంటివి ఓపెన్ గా మాట్లాడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపింది. అయితే అలా తనను ప్రేరేపించడానికి కారణమేమిటి? అంటే .. తనను మగాడిలా ఉన్నావని విమర్శించిన సందర్భాలు ఉన్నాయట.
చిత్ర పరిశ్రమలో బాడీ షేమింగ్, బ్యూటీ స్టాండర్డ్స్ వంటి విషయాల విషయానికి వస్తే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, ప్లాస్టిక్ సర్జరీ చేయటానికి తనను ప్రేరేపించిన దాని గురించి మాట్లాడారు. అందంగా ఉండాలనే ఒత్తిడి వల్లనేనా? అని ప్రశ్నిస్తే.. అవును ఒత్తిడి ఉందని అంగీకరించిన శ్రుతిహాసన్ నా తొలి చిత్రం తర్వాత నా ముక్కుకు శస్త్ర చికిత్స జరిగిందని వెల్లడించింది. శ్రుతిహాసన్ బాలీవుడ్ లో లక్ అనే సినిమాతో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది.