సప్తగిరి కాళ్ళకు దండం పెడతానన్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో అతి పెద్ద స్టార్ హీరో. ఈ ఏజ్ లో కూడా యాక్షన్, డైలాగ్స్ తో దుమ్ము దులిపేస్తున్నాడు బాలకృష్ణ. రీసెంట్ గా ‘అఖండ’ సినిమాతో భారీ హిట్ కొట్టిన బాలకృష్ణ కమెడియన్ సప్తగిరి కాళ్ళకు దండం పెట్టడానికి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం ఈ  వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, బాలకృష్ణ, సప్తగిరి గోపీచంద్ మలినేని సినిమాలో ఒక సీన్ లో భాగంగా బాలయ్య, సప్తగిరి కలిసి ఒక భారీ డైలాగ్ ను చెప్పడానికి ప్రయత్నం చేశారు.అయితే బాలయ్య ఆ డైలాగ్ ను మధ్యలోనే ఆపేయగా సప్తగిరి మాత్రం అస్సలు తడబడకుండా డైలాగ్ చెప్పి ప్రశంసలు అందుకున్నాడు.

సప్తగిరి డైలాగ్ ను కరెక్ట్ గా చెప్పడంతో కాళ్లు పైకెత్తు దండం పెడతానని బాలయ్య చెప్పగా సప్తగిరి రివర్స్ లో గోపీచంద్ మలినేని కాళ్లకు దండం పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.