టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ గా వెలిగిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కలిసి ఒక్కసారి కూడా నటించలేదు. అభిమానులు ఎంతో ఆశపడినా కానీ ఈ నలుగురు మాత్రం ముల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉన్నారు.
కొన్నాళ్ల తర్వాత వెంకటేష్ తో ముల్టీస్టారర్ ట్రెండ్ తెలుగు లో మళ్ళీ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తుంది.
బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవి తేజ, చిరంజీవి తమ్ముడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో వెంకటేష్ కూడా సరదాగా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతానికి ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రవితేజ, చిరంజీవిలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.