`గుణ 369` ఫిలింన‌గ‌ర్ టాక్ – కార్తికేయ మ‌ళ్లీ అదే త‌ప్పు?

`గుణ 369` ఫిలింన‌గ‌ర్ టాక్ – కార్తికేయ మ‌ళ్లీ అదే త‌ప్పు?

న‌టించిన తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ‌. ఆర్.ఎక్స్100 గ్రాండ్ స‌క్సెస్ అత‌డిలో జోష్ నింపింది. అయితే ద్వితీయ ప్ర‌య‌త్నం `హిప్పీ` మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. జెడీ చ‌క్ర‌వ‌ర్తి లాంటి సీనియ‌ర్ తో క‌లిసి క్రేజీ బ్యాన‌ర్ లో న‌టించాడు. కానీ ప‌లితం రివ‌ర్స‌య్యింది. ఇప్పుడు మూడో ప్ర‌య‌త్నం `గుణ 369` ఎలాంటి రిజ‌ల్ట్ ని ఇవ్వ‌బోతోంది? అన్న చ‌ర్చ సాగుతోంది.

`గుణ 369` సెన్సార్ పూర్త‌యింది. యుఏ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. ఈ శుక్ర‌వారం (ఆగ‌స్టు 2) సినిమా థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. తాజాగా ఈ సినిమా ఫిలింన‌గ‌ర్ టాక్ లీకైంది. ఇదో యావ‌రేజ్ సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. పాత సీసాలో కొత్త సారాయి త‌ర‌హాలో క‌థ‌లో కొత్త‌దనం లేదు అన్న‌ది ఇన్ సైడ్ టాక్. ఇక హిప్పీ ఫ్లాప్ ప్ర‌భావం గుణ 369 బిజినెస్ పైనా ప‌డింద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగానూ హైప్ క‌నిపించ‌లేదు. తొలిరోజు క్రిటిక్స్ నుంచి ఎలాంటి స్పంద‌న ఉంటుంది అన్న‌ది చూడాలి. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన రీమేక్ చిత్రం రాక్ష‌సుడు రిలీజ్ కి వ‌స్తోంది. రెండు సినిమాల మ‌ధ్య పోటీ ఉన్న‌ప్పుడు హిట్ టాక్ త‌ప్పనిస‌రి. మొద‌టి రోజు గుణ 369 కి జ‌న‌ర‌ల్ ఆడియెన్ లో ఎలాంటి టాక్ రాబోతోంది అన్న‌ది చూడాలి.