కళ్యాణ్ రామ్ గురించి తెలిసిన వాళ్లు..అతనితో మాట్లాడిన వాళ్లకి తెలుస్తుంది అతను ఎంత సౌమ్యుడో. వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అతని అమాయకత్వంలో ఎంతో అదం కనిపిస్తుంది. చీమకి కూడా హాని తలపెట్టని మంచి గొప్ప వ్యక్తిత్వం గలవాడని చాలా మంది అంటుంటారు. ఇక పబ్లిక్ వేదికలసై అతని సౌమ్యంగా మెలుగుతాడో నందమూరి అభిమానులందరికీ తెలిసిందే. కలుపుగోలుతనం గల మనసున్న వ్యక్తి. స్టార్ గా కంటే ముందుగా ఓ మనిషిని…వ్యక్తితత్వం గలవాడినని చాలా సందర్భాల్లో నిరూపించాడు.
స్టార్ స్టేటస్ ని ఎక్కడా చూపించడు. చాలా సింపుల్ గా కనిపిస్తాడు. అయితే అతని ఈ వ్యక్తిత్వాన్ని బట్టే సతీశ్ వేగేశ్న ఎంత మంచివాడవురా కథను సిద్దం చేసినట్లు కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వూలో రివీల్ చేసారు. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఎంత మంచివాడవురా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కళ్యాణ్ రామ్ పాత్ర ఎలా ఉంటుదని ప్రశ్నిచంగా తను రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో! తను పాత్ర లాగే ఉంటుందని రివీల్ చేసాడు.వ్యక్తిగతంగా చాలా సింపుల్ గా ఉంటాను. నా పాత్ర సహా సినిమా మొత్తం కూడా అంతే కూల్ గా ఉంటుందన్నాడు. షూటింగ్ కి వెళ్లే ముందు డైరెక్టర్ ఒక్కటే చెప్పారు.షూటింగ్ జరిగినంత కాలం సంతోషం గా…నవ్వుతూ ఉండండి అదే మన సినిమా అన్నారు. ఆయన అన్నట్లే చేసానని కళ్యాణ్ రామ్ తెలిపారు. అయితే ఆన్ స్ర్కీన్ పై ఇలాంటి పాత్రతో మెప్పించడం అంటే ఈజీ కాదు. రియల్ వేరు..రీల్ వేరు కాబట్టి కళ్యాణ్ రామ్ హవభావాలు ఎలా పండాయో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
గతంలో ఇలాంటి ప్రయత్నం పూరి జగన్నాథ్ పొకిరి సినిమా లో మహేష్ పాత్ర కోసం చేసాడు. పోకిరి లో మహేష్ యాక్టింగ్ ను సింగిల్ టేక్ లో కే చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే షూటింగ్ సమయంలో ఇలా సింగిల్ టేక్ లో ఒకే చేస్తున్నారు! హిట్టు అవుద్దాని చాలా సందేహాలు పూరి ముందు ఉంచాడు మహేష్. ఇది నీ రియల్ క్యారెక్టర్….ఆ పాత్ర అలాగే ఉంటుందని చెప్పాడు. అన్నట్లే ఆ సినిమా ఇండస్ర్టీ రికార్డులనే తిరగరాసింది కదా.