అండర్ వరల్డ్ డాన్ దావూద్ క‌రోనాతో మ‌ర‌ణించారా?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అతను పాకిస్తాన్ లో దాక్కుని దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి శిక్షించడానికి భారతదేశం ప్రయత్నాలు చేసినప్పటికీ, అంతర్గత శత్రువులు వెలుప‌లి రాజ‌కీయాలు అందుకు ఎంత‌మాత్రం సాయ‌ప‌డ‌లేదు.

వీటన్నిటి మధ్యలో దావూద్ ఇబ్రహీం గురించిన తాజా వార్త క‌ల‌క‌లం రేపుతోంది. ది గ్రేట్ డాన్ తుది శ్వాస విడిచినట్లు తాజాగా స‌మాచారం అందింది. అయితే ఇది నిజ‌మా? అంటే.. పాకిస్తాన్ మీడియా ఎప్పుడూ తప్పుడు సమాచారాన్ని ప్ర‌పంచానికి ప్ర‌చారం చేస్తుంటుంది. దావూద్ ఇబ్రహీం మరణ వార్త అలాంటిదేన‌ని అంతా భావిస్తున్నారు.

ఘోరమైన కరోనావైరస్ కోసం దావూద్ ఇబ్రహీం .. అతని భార్యకు పాజిటివ్ వ‌చ్చింద‌ని అది మ‌ర‌ణానికి దారి తీసింద‌ని ప్ర‌చారం చేసింది పాక్ మీడియా. దావూద్ అతని భార్య మహాజాబీన్ కాకుండా, అతని వ్యక్తిగత సిబ్బంది మొత్తం ఆస్ప‌త్రిలో నిర్బంధించబడ్డార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అనారోగ్యం దానికి తోడు వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా దావూద్ కన్నుమూశారని ప్ర‌చారం సాగుతోంది.

పాకిస్తాన్- కరాచీలోని ఒక మిలటరీ ఆసుపత్రిలో కరోనావైరస్ చికిత్స పొందుతూ దావూద్ తుదిశ్వాస విడిచార‌ని పుకార్లు వ్యాపించాయి. ముంబైలో జన్మించిన దావూద్ 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ త‌ర్వాత దాయాది దేశం పాకిస్తాన్ కు పారిపోయాడు. అతను వాస్త‌వానికి పాక్ ప్ర‌భుత్వంచే నియమించబడిన ప్రపంచ ఉగ్రవాది అన్న సంగ‌తి తెలిసిందే. పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంది. ఆ దేశానికి కొన్ని దేశాల సాయం కూడా క‌లిసొస్తోంద‌న్న సంగ‌తి తెలిసిందే.