జూనియర్ మీద బాలకృష్ణ కు కోపం పోలేదా ?

అరవింద సమేత వీర రాఘవ సినిమా విజయోత్సవానికి ముఖ్య అతిగా వచ్చిన నందమూరి బాలకృష్ణ తన అన్న నందమూరి హరికృష్ణ గురించి బాగా మాట్లాడారు . అన్నరాగి వ్యక్తిత్వం గురించి వర్ణించాడు . తండ్రికి హరికృష్ణ చేదోడు వాదోడుగా వున్నాడని చెప్పాడు . కానీ అరవింద సామెత సినిమా విజయానికి కారకుడైన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడక పోవడం విడ్డురంగా అనిపించింది .

ఈ చిత్రంలో నటించిన నటి నటులు , సాంకేతిక నిపుణులు, నిర్మాత , దర్శకుడు అందరి గురించి మాట్లాడాడు ఒక్క జూనియర్ ను వదిలేసి . అంటే బాలకృష్ణ కావాలనే చేశాడా ? మన కుటుంబ సభ్యుడే కదా అని లైట్ గా తీసుకున్నాడా?

సభలో జూనియర్ బొకే అందించేటప్పుడు బాలకృష జూనియర్ ను హాగ్ చేసుకున్నాడు , మధ్య మధ్యలో జూనియర్తో మాట్లాడుతూనే వున్నాడు . అయినా బాలకృష్ణ తన ఉపన్యాసంలో మాత్రం జూనియర్ గురించి ఒక్క మాట కూడా చెప్పక పోవడం గమనార్హం . అయినా జూనియర్ ఎక్కడా అసంతృప్తి చెందలేదు . బాబాయ్ తన సినిమా విజయోత్సవానికి వచ్చాడు అంటే చాలు అనుకున్నాడు .