రాధికా ఆప్టే ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ కరోనా కాలంలో తోటి హీరోయిన్లంతా వంటలు చేస్తూ, ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఎక్స్ స్రైజ్ లు చేస్తూ ఉంటే రాధికా ఆప్టే మాత్రం కథ రాసిందట. అందరూ వెబ్ సిరీస్ లు చూడడానికి సమయం కేటాయిస్తుంటే.. రాధికా ఆప్టే మాత్రం వెబ్ సిరీస్ రాయడానికి కరోనా సమయాన్ని వాడేసుకుంది. అసలుకే ఈ హాట్ బ్యూటీ మాములు సినిమాల్లోనే ఎప్పుడూ న్యూడ్ గా కనిపిద్దమా అని ఎదురుచూస్తూ ఉంటుంది, మరి ఈవిడగారే కథ రాసింది అంటే.. ఇక ఆ కథలోని బూతు బాగోతం గురించి ప్రత్యేకంగా చెప్పెదేముంది.
ఇంతకీ ఈ బ్యూటీ కథలు రాయడానికి కారణం ఏమిటయ్యా అంటే.. అమ్మడు దర్శకత్వం చేస్తోందట. ఈ రైటింగ్ అనేది గొప్ప కళ. ప్రస్తుతం నేను రాస్తున్నది నాకు బాగా నచ్చింది.. అందుకే నేనే డైరక్ట్ చేయబోతున్నాను అని కనిపించిన అందరికీ చెప్పుకుంటూ పోతుందట. ఇలా తను కథలు రాస్తున్న విషయం తెలిసి.. కొంతమంది దర్శకులు ఈవిడకి ఫోన్ చేసి.. కథలు చెప్పమని అడుగుతున్నారట. మరి అంత గొప్ప దర్శకులు ఎవరో.
పెద్దగా స్టార్ డమ్ లేకపోయినా, చాన్స్ లు రాకపోయినా.. ఇంట్లో ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేయడం ఇష్టం లేని హీరోయిన్లంతా ఇలాంటి కబుర్లే చెబుతారు. పైగా తనకు పుస్తకాలు చదివే అలవాటు ఉందని.. ఈ లాక్ డౌన్ లో చాల పుస్తకాలు చదివానని.. వాటి ప్రేరణతోనే స్టోరీస్ రైటింగ్ పై ఎక్కువ దృష్టిపెట్టానని ఇలా ఏదేదో చెబుతూ గొప్పలు పోతుంది రాధిక ఆప్టే. చివరికి ఈమె కథల ప్రయాణం ఎంతవరకూ వస్తోందో చూడాలి. అయితే గొప్పలు పోతోన్న ఈమె మీద కొంతమంది దర్శకులు చాటుగా నోరు పుక్కిలిస్తున్నారులెండి.