‘రంగస్దలం’ స్పూర్తితో శర్వానంద్ కొత్త చిత్రం టైటిల్

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న శర్వానంద్‌ త్వరలో మరో డిఫరెంట్‌ పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా పడి పడి లేచే మనసు సినిమాతో నిరాశపరిచిన శర్వా, తదుపరి చిత్రం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. వీటిలో ఒకటి యంగ్ లుక్ తో ఉన్న పాత్ర కాగా మరో పాత్రలో వయసైన వ్యక్తిగా కనిపించనున్నాడట.

శర్వానంద్‌ సరసన హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ చిత్రం టైటిల్ ని ఖరారు చేయలేదు. అలాగే ఫస్ట్ లుక్ ని వదలలేదు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మే 25 న అంటే శనివారం విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ప్రీ లుక్ ని వదిలారు.

ఇక ఈ చిత్రానికి రణరంగం అనే టైటిల్ ని ఫైనల్ చేసారని సమాచారం. రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్దలం హిట్ కావటంతో ఇప్పుడీ టైటిల్ ని సెంటిమెంట్ గా పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్స్. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.