రజినీకాంత్ “జైలర్” సినిమా కథ ఇదేనా? ఇంట్రెస్టింగ్ సమాచారం మీకోసం.!

తాజాగా సౌత్ ఇండియన్ సినిమా షేక్ అయ్యే అనౌన్సమెంట్ ఒకటి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమానే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించబోయే సినిమా టైటిల్ అనౌన్సమెంట్. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే “జైలర్” అంటూ మాస్ పోస్టర్ ని రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా కథని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎలా డిజైన్ చేసాడు అనేది తమిళ సినీ వర్గాల్లో లీకయ్యినట్టు తెలుస్తుంది. 

ఈ చిత్రాన్ని కూడా నెల్సన్ తన “బీస్ట్” సినిమా తరహాలోనే డిజైన్ చేసాడట. అందులో ఒక షాపింగ్ మాల్ లో సినిమా రన్ అవ్వగా ఈ సినిమాలో దాదాపు అంతా జైలు లో ఉంటుంది అని తెలుస్తుంది. ఇక్క రజినీకాంత్ ఎలా కనిపిస్తాడు అనే దానిపై కూడా ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం అయితే రజిని జైలర్ గా కాకుండా జైల్లో ఖైదీగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. 

మరి అలాంటప్ప్పుడు జైలర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మరింత ఆసక్తిగా వినిపిస్తుంది. అలాగే సినిమా లో ఏక్షన్ పాళ్ళు కూడా ఎక్కువే ఉంటాయట అది కూడా ఆ జైలు సెటప్ లోనే భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్. ప్రస్తుతానికి అయితే సమాచారం ఇలా ఉంది. మరి నిజంగానే కథ ఎలా ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.