పుష్ప 2 : ఈ పనుల్లో సుకుమార్ అండ్ దేవిశ్రీ ప్రసాద్..?

టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్రేజీ కాంబోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబో కూడా ఒకటి. వారి నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రతి ఆల్బమ్ ట్రెండ్ సెట్టింగ్ గా నిలిచింది.

మరి వీరి కాంబో నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రమే “పుష్ప ది రైజ్” పార్ట్ 1 గా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి అదరగొట్టింది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాపై అయితే భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఇండస్ట్రీ వర్గాలు నుంచి అయితే ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు అయితే కీలక పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. శరవేగంగా ఇపుడు అయితే మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఈ ఇద్దరూ పాల్గొంటున్నారట.

పుష్ప 1 కన్నా ఎక్కువ క్లిక్ అయ్యే ట్యూన్స్ మరియు రిథమ్స్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్టుగా సినీ వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తున్న టాక్. మొత్తానికి అయితే ఈ ఆల్బమ్ ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేస్తుందో చూడాలి.

ఇంకా ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ తో పాటు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని గట్టి బజ్ ఉంది. మరి వీటికి సంబంధించి మరింత సమాచారం బయటకి రావాల్సి ఉంది.