ఇండస్ట్రీ టాక్ : కళ్యాణ్ రామ్ “బింబిసార” డిజిటల్ సందడి ఎప్పుడంటే.!

గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా నందమూరి ఫ్యాన్స్ మాత్రమే అని చెప్పాలి. గత ఏడాది “అఖండ” నుంచి స్టార్ట్ అయ్యిన విజయాలు నెక్స్ట్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్(RRR) ఆ తర్వాత కళ్యాణ్ రామ్ “బింబిసార” వరకు వచ్చి భారీ హిట్స్ అయ్యాయి.

దీనితో నందమూరి ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించగా క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించారు. అయితే థియేటర్స్ లో బ్లాస్టింగ్ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గా సందడి చేసేందుకు రెడీ అయ్యినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రం తాలూకా డిజిటిల్ రైట్స్ ని సొంతం చేసుకున్న జీ 5 లో ఈ సినిమా అయితే ఈ అక్టోబర్ 7 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ అప్డేట్ వైరల్ గా మారింది. ఇక ఈ భారీ సినిమాకి అయితే ఎం ఎం కీరవాణి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా నందమూరి కళ్యాణ్ రామ్ నే నిర్మాణం వహించాడు. అలాగే దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.