ఎన్టీఆర్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉంది.. వేణు స్వామి!

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం సినిమాలపై పెట్టారు. అయితే నందమూరి వారసుడిగా రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఎంతోమంది అభిమానులు భావించిన తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన పూర్తి దృష్టిని సినిమాలపై ఉంచారు. ఈ క్రమంలోని పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వేణుస్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ జాతకంలో తనకు సీఎం అయ్యే యోగం ఉందని వెల్లడించారు.

In The Ntr Horoscope To Become The Cm Venu Swami | Telugu Rajyamఎన్టీఆర్ నక్షత్రం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నక్షత్రం ఒకటే. వీరు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలలో కూడా మంచిగా రాణిస్తారు. కనుక ఎన్టీఆర్ కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలి అంటే కేవలం ఎన్టీఆర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

అదేవిధంగా బాలకృష్ణ సీఎం అయ్యే అవకాశాలే లేవని, ఎన్టీఆర్ సీఎం అవుతారని తన జాతకంలో ఆ యోగం ఉందని ఇతను తెలిపారు. వేణు స్వామి చెప్పిన విధంగా సమంత నాగచైతన్య విడాకులు విషయం నిజం కావడంతో ఆయన పలువురు సినీ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2024 వ సంవత్సరానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉండదని అతను రాజకీయాల నుంచి తప్పుకుంటారని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సిఎం అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles