చూసారా? : చాలా కొత్తగా ఇలియానా లుక్ (ఫొటో)

తన చక్కని,చిక్కిన నాజూకైన నడుము అందంతో సినీ పరిశ్రమలో ప్రత్యేకతను సొంతం చేసుకున్న అందాల ముద్దుగుమ్మ ఇలియానా. కెరీర్ ప్రారంభం నుంచి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ అందాల భామ గత కొంత కాలంగా టాలీవుడ్ కి దూరమై బాలీవుడ్ లో సెటిల్ అయ్యిపోయింది. రవితేజతో చేసిన దేవుడు చేసిన మనుష్యులు డిజాస్టర్ తర్వాత ఆమె ఇటువైపు చూడటానికి ఆసక్తి చూపలేదు. బాలీవుడ్ ప్రయాణం కూడా అనుకున్నంత గొప్పగా సాగటం లేదు. ఈ నేపధ్యంలో మళ్లీ తన హీరో రవితేజ నుంచి పిలుపు వచ్చింది. తన ప్రక్కన చేసి హిట్ కొడదాం రమ్మని ఆయన ఆహ్వానించారు.

అలా తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ అంటోని’ లో ఆఫర్ రావటం, ఓకే చేయటం జరిగింది. దాంతో ఇలియానా అభిమానులంతా ఆమె ఏ పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్ ఏమిటి…లావు అయ్యిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఎలా కనిపిస్తుంది అంటూ బెంగ పెట్టేసుకున్నారు.

ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో ‘అమర్ అక్బర్ అంటోని’సినిమాలోదే. తన గ్లామర్ రోల్స్ కు భిన్నంగా ఫంకీ రోల్ లో ఇలియానా కనిపించనుంది. సినిమాలో ఈమె పాత్ర కథను మలుపు తిప్పే ఇంట్రస్టింగ్ మలుపులతో ఉంటుందిట. అలా వచ్చి ఏదో రెండు పాటల్లో కనపడే పాత్ర కాదట. అందుకే ఒప్పుకుందిట. మరి ఏ మేరకు ఇలియానా రీఎంట్రీ వర్కవుట్ అవుతుందనే విషయం సినిమా రిలీజ్ అయితే గానీ చెప్పలేం.

రవితేజ విషయానికి వస్తే… బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్‌, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలలో రాజా ది గ్రేట్ మంచి విజయాన్ని సాధించగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలు నిరాశపరచాయి. ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు సమాచారం. శ్రీను వైట్ల- రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.