“అమర్ అక్బర్ అంథోని” పై ఇలియానా ఆశలు

ఇలియానా అనగానే అద్భుతమైన శృగార శిల్పం  గుర్తుకొస్తుంది. ఆమె చేసిన సినిమాలో తక్కువైనా తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఇలియానా  ఈరోజు తన 31వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నది .

2006లో వై వి ఎస్  చౌదరి “దేవదాస్ సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశాడు . అదే సంవత్సరం  “పోకిరి “, “కేడి”, ఖతర్నాక్ , రాఖీ సినిమాలు చేసి ప్రేక్షకులను తన నటనతో, హావభావాలతో , వయ్యారాలతో  ఊపేసింది .

తెలుగు ,కన్నడ భాషలలో నటిస్తున్న ఇలియానాకు 2012లో “బర్ఫీ ” అనే చిత్రం తో హిందీ సినిమా రంగంలోకి వెళ్లి పోయింది . మిగతా  భాషల సినిమాలపై శీత  కన్నేసింది . ముంబై లో ఉండి 8 హిందీ సినిమాలను చేసింది . తన ప్రియుడు  ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్  ఆండ్రూ  క్నీబోనే తో సహజీవన చేస్తుంది . అయితే అతనితో వివాహం చేసుకుందని అంటారు .

ఆరు  సంవత్సరాల తరువాత  రవితేజాతో స్టిను వైట్ల దర్శకత్వంలో “అమర్ అక్బర్  ఆంథోనీ ” చిత్రంలో నటిస్తున్నది . ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మించారు . అన్ని కార్య క్రమాలను పూర్తి చేసుకొని ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కాబోతున్నది . చాలా కాలం తరువాత ఇలియానా ఈ తెలుగు సినిమాలో నటించింది . అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది