పాత్ర నచ్చితే హీరో వయస్సు గురించి పట్టించుకోను : రకుల్ ప్రీత్ సింగ్.

“నేను సీనియర్లతో నటిస్తున్నానా… నాకంటే వయసు తక్కువ ఉన్నవాళ్లతో నటిస్తున్నానా… అనేది ఆలోచించను. నాకు పాత్ర నచ్చితే చాలు” అంటోంది  రకుల్ ప్రీత్ సింగ్. 
 
‘దే దే ప్యార్‌ దే’, ‘మన్మథుడు 2’ కథల ప్రకారం… నేను పెద్ద వయసున్న వాళ్లతో ప్రేమలో పడాలి. రెండు చోట్లా నా వయసు పాతికేళ్ళు. కథకు అవసరం అనుకున్నప్పుడు ఎవరి పక్కన నటిస్తే ఏమిటి… నటిగా నేను ఎదగాలి. అలాంటప్పుడు మంచి పాత్రను ఎందుకు వదిలేయాలి? యంగ్ హీరోతో నాలుగు సీన్లు, పాటల్లో చేసే కంటే.. ప్రేక్షకులలో గుర్తింపునిచ్చే పాత్రలో నటించడానికే నేను ఇష్టపడతాను.
 
ఇప్పుడు నితిన్‌తో ఓ సినిమా చేస్తున్నా. అందులో నేను లాయర్‌గా కనిపిస్తా… అది నటనకు ఆస్కారం ఉన్న పాత్ర, అందుకే అంగీకరించాను.. నాకు నచ్చితే హీరో వయస్సు గురించి పట్టించుకోను” అని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
 
 
 
 
Attachments area