ట్రైలర్ అడల్ట్ కు ఉషారు తెప్పించేటట్లుందే..

యూత్ తో ధియోటర్స్ హౌస్ ఫుల్స్ అవ్వాలంటే అడల్ట్ బిల్  అవసరమనే నిర్ణయానికి తెలుగు నిర్మాతలు వచ్చేసినట్లున్నారు. అర్జున్ రెడ్డి అందుకే హిట్ అయ్యిందని కొందరు స్క్రిప్టు లు రాసేస్తున్నారు. అయితే అర్జున్ రెడ్డి ఎందుకు హిట్ అయ్యిందో ఎనాలసిస్ కన్నా…ఆ సినిమాని అడ్డం పెట్టి ఓ సినిమాని లాగించేస్తే డబ్బులు మిగులుతాయనే డెసిషన్ కు వచ్చేస్తున్నారు.

అలాంటి స్కీమ్ లో రాబోతున్న సినిమానే హుషారు అనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తూంటే. అయితే సినిమా చూడకుండానే కేవలం ట్రైలర్ చూసి ఓ నిర్ణయానికి రాకూడదు అనొచ్చు కానీ ఈ కంటెంట్ చూస్తే అలాంటి ఆలోచనలే వస్తాయి ఖచ్చితంగా. ఇంతలా బిల్డప్ ఇస్తున్నారు …ఆ ట్రైలర్ ఏదో చూపించండి అంటారా..అయితే ఇదిగో ఇక్కడ చూసేయండి.